logo

‘మైలు నడవండి.. రక్తంలో గడ్డల్ని నివారించండి’

‘రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం ప్రాణాపాయం.. రోజూ నడక, వ్యాయామంతో సమస్యను నివారించవచ్చు’ అని అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం కిమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడక నిర్వహించారు.

Published : 27 Mar 2023 01:32 IST

కిమ్స్‌ ఆధ్వర్యంలో జలవిహార్‌ వద్ద నిర్వహించిన అవగాహన నడక

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ‘రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం ప్రాణాపాయం.. రోజూ నడక, వ్యాయామంతో సమస్యను నివారించవచ్చు’ అని అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం కిమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడక నిర్వహించారు. సినీనటి మంచు లక్ష్మి, కిమ్స్‌ గ్రూప్‌ ఆస్పత్రుల సీఎండీ డా.బొల్లినేని భాస్కరరావు జలవిహార్‌ వద్ద జెండా ఊపి ఈ నడకను ప్రారంభించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మహిళల్లో డీప్‌ వీనస్‌ థ్రాంబోసిస్‌ (డీవీటీ) వచ్చే అవకాశం అధికమన్నారు. రోజుకు ఒక మైలు దూరం నడిస్తే ముప్పును చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. భాస్కరరావు మాట్లాడుతూ.. రోజూ మూడు గంటలకు పైగా కారు, రైలు, విమానాల్లో ప్రయాణం చేసే వారికి ఈ సమస్య రావచ్చన్నారు. సమావేశంలో కిమ్స్‌ ఆస్పత్రి కన్సల్టెంట్‌ వాస్క్యులర్‌, ఎండోవాస్క్యులర్‌ సర్జన్‌ డా.నరేంద్రనాథ్‌ మేడా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని