logo

ఫ్యాన్సీ నంబర్లతో కాసుల పంట

రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా కాసుల పంట పండుతోంది. రవాణా శాఖ సెంట్రల్‌ జోన్‌ ఖైరతాబాద్‌లో ఒక్క రోజులోనే రూ.22,07,588 రాబడి వచ్చింది.

Published : 29 Mar 2023 02:09 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా కాసుల పంట పండుతోంది. రవాణా శాఖ సెంట్రల్‌ జోన్‌ ఖైరతాబాద్‌లో ఒక్క రోజులోనే రూ.22,07,588 రాబడి వచ్చింది. మంగళవారం టీఎస్‌09జీఏ సీరీస్‌ నుంచి జీబీ సీరీస్‌లోకి మారిన సందర్భంగా ఫ్యాన్సీ నంబర్ల వేలం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు జేటీసీ పాండురంగ నాయక్‌ వెల్లడించారు. టీఎస్‌ 09జీఏ 9999 నంబరును కేపీ వెంకటసుబ్బయ్య టెండరు ద్వారా రూ.3,50,009 చెల్లించి సొంతం చేసుకున్నారు. కొత్త సీరీస్‌లోని టీఎస్‌ 09జీబీ0006 నంబరుకు ఏఎంఆర్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.2,13,116, జీబీ 0005కు స్టోన్‌ క్రాఫ్ట్‌ డెవలపర్స్‌ రూ.1,61,500 చెల్లించింది. పాత సీరీస్‌లోని జీఏ 9909కు ఆర్‌కే మార్కెటింగ్‌ సర్వీసెస్‌ రూ.1,15,559, కొత్త సీరీస్‌ జీబీ 0090 బెవ్‌గో వెంచర్స్‌ రూ.1,01,000లకు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని