రుణ యాప్ వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్య
రుణ యాప్ వేధింపులతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఎస్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శ్రావణ్‌కుమార్‌రెడ్డి
బి.కొత్తకోట, న్యూస్‌టుడే: రుణ యాప్ వేధింపులతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఎస్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్.ఐ.రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం రైతు జయరామిరెడ్డి కుమారుడైన శ్రావణ్‌కుమార్‌రెడ్డి బీటెక్ పూర్తిచేసి ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందట రుణయాప్‌లో అప్పు తీసుకున్నారు. యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో రూ.3.50 లక్షల వరకు చెల్లించినా వేధింపులు కొన సాగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అప్పులు తీర్చుకునేందుకు రూ.4 లక్షలు కావాలని తండ్రిని కోరడంతో వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు కొంతమేర ఇప్పటికే జమ చేశారు. ఈ నెల 26న డబ్బు ఇచ్చేందుకు తండ్రి ఏర్పాట్లు చేశారు. అయితే శ్రావణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి తన బంధువుల ఊరైన మొరంపల్లెకు చేరుకుని అక్కడి పూతపల్లేశ్వరస్వామి ఆలయంలోని కిటికీ కమ్మీలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మృతుడి తల్లి దండ్రులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి తన వెంట కొత్తగా కొనుగోలు చేసిన కొడవలితో పాటు కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్.ఐ.మాట్లాడుతూ బుధవారం రాత్రి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని, రుణయాప్ ఆగడాలతో పాటు క్రికెట్ బెట్టింగులకు అప్పులు చేసి ఉండవచ్చునన్న కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Train accident: గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
-
Crime News
Cyber Crime: రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!
-
World News
Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్
-
Crime News
Hyderabad: పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు