logo

దశాబ్ది వేడుకలు వైభవంగా నిర్వహిద్దాం: మంత్రి

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని... అందరినీ భాగస్వామ్యం చేయాలని  మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.

Published : 28 May 2023 01:45 IST

ప్రసంగిస్తున్న మల్లారెడ్డి, వేదికపై కలెక్టర్‌ 

మేడ్చల్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని... అందరినీ భాగస్వామ్యం చేయాలని  మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. 21 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు ముందస్తు ఏర్పాట్ల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ మాట్లాడారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి,  ఎమ్మెల్యేలు కృష్ణారావు, సుభాష్‌రెడ్డి, వివేకానందగౌడ్‌, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్‌ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌ పాల్గొన్నారు.
మంత్రికి నిరసన సెగ:  ప్రభుత్వం ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. భాజపా ప్రజాప్రతినిధులు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. వేడుకల్లో డ్యాన్సులు చేయిస్తామని మంత్రి అనడాన్ని తప్పు పట్టారు.  ఎంపీటీసీ సభ్యురాలు శోభ (భాజపా)నిరసన వ్యక్తం చేయగా... అధికార పార్టీకి చెందిన మహిళా నేతలు బయటికి లాక్కెళ్లారు.

శోభను బయటకు లాక్కెళ్తున్న దృశ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని