logo

నిరీక్షణతో నష్టం.. తరలిస్తే నయం

కొనుగోలు కేంద్రాల నుంచి తాండూరు మండలం ఖాంజాపూర్‌్ గేటు వద్ద గోదాంకు తెచ్చిన ధాన్యం బస్తాలను రైతులే హమాలీలుగా తరలించాల్సి వస్తోంది.

Updated : 29 May 2023 04:44 IST

రైతులే హమాలీలుగా  మారిన తీరు

ధాన్యం సంచుల్ని గోదాంలోకి చేరుస్తున్న జనగాం రైతులు

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: కొనుగోలు కేంద్రాల నుంచి తాండూరు మండలం ఖాంజాపూర్‌్ గేటు వద్ద గోదాంకు తెచ్చిన ధాన్యం బస్తాలను రైతులే హమాలీలుగా తరలించాల్సి వస్తోంది. తాండూరు, పెద్దేముల్‌ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం బస్తాలను అక్కడి ఇంఛార్జి అధికారులు లారీలు, ట్రాక్టర్‌లలో నేరుగా గోదాం వద్దకు పంపుతున్నారు. గోదాం వద్ద ధాన్యం వాహనాలు బారులు తీరుతున్నాయి. వందల సంఖ్య వాహనాలతో హమాలీలు దించాలంటే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గంటలు, రోజుల తరబడి నిరీక్షించలేక రైతులే తమ వాహహనాల్లోని బస్తాలను గోదాంలోకి చేరవేస్తున్నారు.

లారీ అద్దె భారం మోయలేం

తాండూరు మండలం బెల్కటూరుకు చెందిన రవికుమార్‌, బసంత్‌, ఉదయ్‌శంకర్‌లు లారీలో 250 బస్తాలను గోదాంకు తెచ్చారు. మూడు రోజులుగా ఖాళీ చేయకపోవడంతో విసుగు చెంది వీరే రెండుగంటలు శ్రమించి బస్తాలను గోదాంలోకి చేరవేశారు. రవికుమార్‌ మాట్లాడుతూ..మూడు రోజులుగా లారీ అద్దె రూ.4వేల చొప్పున 12వేలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఇంకా నిరీక్షిస్తే మరింత అద్దె నష్టపోవాల్సి వస్తుందని తామే హమాలీ పని చేశామన్నారు. చెంగెష్‌పూర్‌కు చెందిన వెంకటయ్య, పెద్దేముల్‌ మండలం జనగాంకు చెందిన రైతులు నాగప్ప, గోపాల్‌్ సైతం తమ వాహనాల్లోని ధాన్యం బస్తాలను గోదాంలోకి తరలించారు. తెల్లవారుజామున వచ్చామని, రాత్రి ఇక్కడ ఉండలేక తామే బస్తాల్ని ఖాళీ చేసి వెళ్తున్నట్లు తెలిపారు. ఇదే విషయమై గుత్తేదారు బల్వంత్‌రెడ్డి మాట్లాడుతూ..బీహార్‌కు చెందిన కూలీలచేత లారీలో ధాన్యం బస్తాల్ని ఖాళీ చేయిస్తున్నామన్నారు. ట్రాక్టర్‌లు ఎక్కువ రావడంతో కూలీల కొరత ఏర్పడినందున రైతులే బస్తాల్ని దించాల్సి వచ్చిందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని