logo

భూకబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ టి. సుచరిత పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 21:27 IST

కాప్రా: ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ టి. సుచరిత పేర్కొన్నారు. కాప్రా మండలంలోని సర్వే నెంబరు 9, 11, 47, 140 నుంచి 143, 151 నుంచి 153, 676, 677 సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 69.21 ఎకరాల కాందీశీకులకు (కస్టోడియన్) చెందిన భూములు వివాదాస్పదంగా మారాయి. కొన్నేళ్లుగా ఇట్టి స్థలాలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా 2011లో ఇట్టి భూములు ప్రభుత్వానికి చెందినవిగా సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని