logo

ఇసుక అక్రమ నిల్వ.. అదనుచూసి విక్రయం

తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 29 Mar 2024 03:22 IST

 

న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు దొడ్డు ఇసుక రూ.3,000, మధ్య రకం ఇసుకు రూ.4,000, సన్నరకం ఇసుక రూ.5,000 చొప్పున విక్రయిస్తున్నారు. డంపులపై పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ అధికారుల తనిఖీలు లేక పోవడంతో డివిజన్లో దందా సాఫీగా సాగి పోతోంది. ప్రస్తుత వేసవిలో ఇసుక తవ్వకాలకు నదులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో అక్రమార్కులు  రాత్రివేళ తవ్వకాలు జరిపి నిర్ణీత ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. తాండూరు పట్టణ శివార్లతో పాటు నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక నిల్వలు విరివిగా కనిపిస్తున్నాయి. పరివాకంగా భూగర్భ జల మట్టం పడిపోకుండా ఉండాలంటే అధికారులు ఇసుక తవ్వకాలను నివారించాలని, నదుల పరివాహక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని