logo

ఇండియా-ది రోడ్‌ టు రినైసెన్స్‌ పుస్తకావిష్కరణ

ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి, విశ్రాంత ఐఏఎస్‌ భీమేశ్వర చల్లా (సీబీ రావు) రాసిన ‘ఇండియా-ది రోడ్‌ టు రినైసెన్స్‌: ఎ విజన్‌ అండ్‌ ఎజెండా’ పుస్తకావిష్కరణ సోమవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)లో జరిగింది.

Published : 16 Apr 2024 05:47 IST

సోమాజిగూడ: ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి, విశ్రాంత ఐఏఎస్‌ భీమేశ్వర చల్లా (సీబీ రావు) రాసిన ‘ఇండియా-ది రోడ్‌ టు రినైసెన్స్‌: ఎ విజన్‌ అండ్‌ ఎజెండా’ పుస్తకావిష్కరణ సోమవారం సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)లో జరిగింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు డా.జయప్రకాష్‌ నారాయణ్‌, కె.పద్మనాభయ్య, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ డా.డి.సుబ్బారావు, టైమ్స్‌ ఫోరం సంపాదకుడు రామ్‌ మనోహర్‌రెడ్డి  పాల్గొన్నారు. ఆస్కీ డీన్‌ ప్రొ.సుబోధ్‌ కుందముతన్‌ స్వాగతోపన్యాసం చేస్తూ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో వచ్చిన ఈ పుస్తకం భిన్నమైందని,  సాంప్రదాయ ఆలోచనలకు బదులుగా కొత్త ఆలోచనలను అందిస్తుందన్నారు.  


‘స్వాలోయింగ్‌ ది సన్‌’...

బంజారాహిల్స్‌: ఐరాస మాజీ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ లక్ష్మి ముర్డేశ్వర్‌ పూరి రచించిన ‘స్వాలోయింగ్‌ ది సన్‌’ పుస్తకావిష్కరణ సోమవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో జరిగింది. అపోలో ఆసుపత్రుల సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి మాట్లాడుతూ.. పుస్తకంలోని  అంశాలు మహిళా సాధికారతకు ఉపయోగపడతాయన్నారు. దిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, రచయిత్రి లక్ష్మి,  కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని