logo

గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ

నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి.

Published : 19 Apr 2024 02:55 IST

పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. రూ.4 కోట్లతో సాగర్‌లో అత్యవసర మోటార్ల ఏర్పాటు పనులు చివరిదశకు చేరుకున్నాయి. వారం క్రితం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిన జలమండలి అధికారులు బుధవారం రాత్రి నిర్ణీత పది మోటార్లలో నాలుగు మోటార్ల నుంచి ప్రయోగాత్మకంగా నీటిని అప్రోచ్‌కెనాల్‌కు సరఫరా చేశారు. గురువారం మరో రెండు 120 మోటార్లు ఏర్పాటు పూర్తిచేసి 240 క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం 10 మోటార్లతో 900 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. మరోవైపు అప్రోచ్‌ కెనాల్‌లో నీటిమట్టం పెంచేందుకు జలాశయంలో అడ్డంగా కట్ట నిర్మాణానికి గ్యాబియన్స్‌, ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కట్టతో కాల్వలో 512 అడుగుల నీటిమట్టం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి విడుదలయ్యే కృష్ణాజలాలు 525 క్యూసెక్కులు ఏఎమ్మార్పీ ద్వారా కోదండాపురం మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటులో శుద్ధి చేసి 270 ఎంజీడీల రూపంలో జంటనగరాలకు చేరుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని