logo

కొండంత న్యాయం నావైపే

చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టుల సముదాయంలో న్యాయవాదులను కలిసి సహకారం అభ్యర్థించారు.

Published : 01 May 2024 04:14 IST

చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టుల సముదాయంలో న్యాయవాదులను కలిసి సహకారం అభ్యర్థించారు.


డ్రైవరన్నా.. యాది మరవకన్నా

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ జగద్గిరిగుట్టలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి లోక్‌సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘన విజయం చేకూర్చాలని ఓటర్లను అభ్యర్థించారు.


కొడతా మటన్‌.. నొక్కండి బటన్‌

వివిధ వృత్తుల ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ రసూల్‌పుర బస్తీలో ఓ కొట్టులో మాంసం కొట్టి ఆకట్టుకున్నారు.


ఈటల రాజేందర్‌ జీ మెట్రో షో

మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎల్‌బీ నగర్‌ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలుకరిస్తూ కనిపించారు.


అంజన్న అండ.. శివయ్యే మది నిండా

సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ రాంనగర్‌ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి బాకారం శివాలయాన్ని సందర్శించారు.


మై అసద్‌.. ఓట్‌ దాలేతో బహుత్‌ పసంద్‌

సంతోష్‌నగర్‌ డివిజన్‌ బస్తీల్లో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పర్యటించారు. హైదరాబాద్‌ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న ఆయన కనిపించిన పెద్దలకు సలాం చేస్తూ.. పలకరిస్తూ ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు.


గడప గడపకు కారు.. గడ్డం హుషారు

గడప గడపకు.. అనే నినాదంతో హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ ఎన్నికల ప్రచారంపై దృష్టి నిలిపారు. గౌలిగూడ ప్రాంతంలోని బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని