logo

ఎర్లీబర్డ్‌లో రూ.820 కోట్ల పన్ను వసూలు

ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి నెలలోనే జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం దాదాపు 40శాతం ఆస్తిపన్నును వసూలు చేసింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రేటర్‌ పరిధిలో ఎర్లీబర్డ్‌ పథకం అమలైంది.

Published : 01 May 2024 04:39 IST

గతేడాది రికార్డును అధిగమించిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి నెలలోనే జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం దాదాపు 40శాతం ఆస్తిపన్నును వసూలు చేసింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రేటర్‌ పరిధిలో ఎర్లీబర్డ్‌ పథకం అమలైంది. పథకంలో భాగంగా ఇళ్ల యజమానులకు వార్షిక పన్నులో 5శాతం రాయితీ లభించనున్న విషయం తెలిసిందే.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.785కోట్ల పన్ను వసూలవగా, ఇప్పుడు రూ.820 కోట్లు ఖజానాకు చేరిందని జీహెచ్‌ఎంసీ మంగళవారం వెల్లడించింది. అందులో రూ.400 కోట్లు కేవలం ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా  చేరిందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.2వేల కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా, మిగిలిన 11 నెలల కాలంలో రూ.1180 కోట్లు రాబట్టుకోవాల్సి ఉందని రెవెన్యూ విభాగం తెలిపింది. రికార్డు వసూళ్లపై కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని