logo

బాబూజీ మార్గదర్శకాలు.. ఉజ్వల భవిష్యత్తుకు నాంది

బాబూజీ మహరాజ్‌ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

Published : 01 May 2024 04:07 IST

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

చరణ్‌జిత్‌, అతడి కుమార్తె దివ్యజ్యోతి సంగీత ప్రదర్శన

నందిగామ, న్యూస్‌టుడే: బాబూజీ మహరాజ్‌ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో మిషన్‌ వ్యవస్థాపకులు బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆర్‌బీఐ ప్రత్యేకంగా ముద్రించిన బాబూజీ మహరాజ్‌ స్మారక వెండి నాణేన్ని దాజీతో పాటు కోవింద్‌ ఆవిష్కరించారు.  బాబూజీ మహరాజ్‌ ఆశయాలను అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్న దాజీని ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా వారోత్సవాలకు విచ్చేసిన అభ్యాసీలందరూ ప్రయోజనం పొందేలా భండారాలను ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు.  శ్రీరామచంద్రమిషన్‌ గ్లోబల్‌ గైడ్‌ కమలేష్‌ డి పటేల్‌ (దాజీ) మాట్లాడుతూ..  బాబూజీ రూపొందించిన సహజమార్గ్‌ పద్ధతి ధ్యానం కులమాతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అభ్యసిస్తున్నారని తెలిపారు.   బాబూజీ చూపిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకుగాను ఆర్బీఐ నాణేలు ముద్రించడం హర్షించదగ్గ విషయమన్నారు. అంతకు ముందు ‘ఫ్రమ్‌ దాజీ విత్‌ లవ్‌’ బాబూజీ మహరాజ్‌ రచనలు, స్పిరిచ్యువల్‌ అనాటమీ పుస్తకాల థాయ్‌, గుజరాతీ, మలయాళం, తెలుగు, ఆంగ్లం భాషల సంచికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్‌జిత్‌, అతడి కుమార్తె దివ్యజ్యోతిల సంగీత ప్రదర్శన అభ్యాసీలను అలరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని