logo

భాజపాతోనే రైతు సంక్షేమం: విశ్వేశ్వర్‌రెడ్డి

భాజపాతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన భాజపా కిసాన్‌మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.

Published : 01 May 2024 03:55 IST

చేవెళ్ల, మొయినాబాద్‌, రాజేంద్రనగర్‌: న్యూస్‌టుడే: భాజపాతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన భాజపా కిసాన్‌మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. రైతు సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, చేవెళ్లను మిల్లెట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు. సమావేశంలో తల్లోజు ఆచారి, నర్సింహారెడ్డి, ఆంజన్‌కుమార్‌గౌడ్‌, ప్రతాప్‌రెడ్డి, జంగారెడ్డి, ప్రకాష్‌, రత్నం, చందు తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్‌ మండలంలో నిర్వహించిన ప్రచారంలో కొండా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, భారాసలు కలిసి ఎన్ని కుయుక్తులకు పాల్పడినా తెలంగాణలో ఈ సారి రెండంకెల స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  అనంతరం అజీజ్‌నగర్‌లో అమ్డాపూర్‌ మాజీ ఎంపీటీసీ సభ్యుడు సామ రాంరెడ్డితో పాటు పలువురు ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొండా సమక్షంలో భాజపాలో చేరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్‌ కోర్టు సముదాయంలో న్యాయవాదులను కలిసి మద్దతు కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు.

పార్టీలోకి పలువురు మీర్‌పేట కార్పొరేటర్లు

మీర్‌పేట, న్యూస్‌టుడే: మీర్‌పేట కార్పొరేషన్‌కు చెందిన నలుగురు భారాస, ముగ్గురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్‌ కోఆప్షన్‌ సభ్యురాలు మంగళవారం భాజపాలో చేరారు. చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ నుంచి వేముల నర్సింహ, ఎడ్ల మల్లేష్‌ ముదిరాజ్‌, జిల్లెల అరుణ, కోఆప్షన్‌ సభ్యురాలు వేముల ఎల్లమ్మ, భారాస నుంచి ఇంద్రావత్‌ రవినాయక్‌, విజయలక్ష్మి, జ్యోతికిషోర్‌, గౌరీశంకర్‌లు భాజపాలో చేరారు. వీరిని మీర్‌పేట భాజపా అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ నివాసంలో సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని