logo

రాజకీయక్షేత్రం సకుటుంబ రాజకీయ ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు..అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సొంత బాణీతో ఆకట్టుకుంటున్నారు.

Published : 01 May 2024 04:23 IST

న్యూస్‌టుడే, ఉప్పల్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు..అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సొంత బాణీతో ఆకట్టుకుంటున్నారు.


పట్నం సునీతామహేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌)కు తోడుగా..

కాప్రాలో పట్నం సునీతారెడ్డి భర్త మహేందర్‌రెడ్డి.

కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి ప్రచారంలో కుటుంబ సభ్యులంతా ఉన్నా..రాజకీయంగా భర్త మహేందర్‌రెడ్డి అన్నీతానై చూస్తున్నారు. మిగతా అభ్యర్థులకు సతీమణులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. ఇక్కడ మాత్రం సతీమణి గెలవాలని ఎమ్మెల్సీ ప్రచారంలోకి దిగారు. కుమారుడు పట్నం రినీష్‌రెడ్డి, కూతురు మనీషారెడ్డి, అల్లుడు హిమదీప్‌ సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు.


ఈటల రాజేందర్‌ (భాజపా) వెంటే..

రామంతాపూర్‌లో ఈటల భార్య జమున

భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కి అన్ని విధాల కుటుంబం తోడుగా ఉంటోంది.  రాజేందర్‌ సతీమణి జమున, కుమారుడు నితిన్‌, కోడలు క్షమిత, కూతురు నీతా, అల్లుడు డా.అనూప్‌ ఇలా కుటుంబ సభ్యులంతా కూడా వారి పద్ధతిలో అన్ని అసెంబ్లీల పరిధిలో కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలోకి దిగారు.


రాగిడి లక్ష్మారెడ్డి (భారాస)కి అండగా..

ఉప్పల్‌లో రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజని

భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికు అండగా ఆయన భార్య రజనీరెడ్డి, కూతురు, అలుడు డా.మౌనికారెడ్డి, భవనం అనిరుధ్‌రెడ్డి, కుమారుడు రుద్ర ప్రచారం చేస్తున్నారు. వీరంతా కూడా లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీలలోనూ ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని