logo

కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం: కాంగ్రెస్‌

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ అన్నారు.

Published : 01 May 2024 03:53 IST

బండ్లగూడజాగీర్‌, కాటేదాన్‌, మణికొండ: న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని, కేంద్రంలోనూ రాహుల్‌గాంధీ సారథ్యంలో దేశ ప్రజలకు మంచి పాలన అందనుందని చెప్పారు. మంగళవారం బండ్లగూడజాగీర్‌ నగరపాల సంస్థ, మైలార్‌దేవుపల్లి డివిజన్‌లోని కాలనీల్లో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, ప్రేమ్‌గౌడ్‌, టింకురెడ్డి, నవీన్‌, గణేష్‌, రాజిరెడ్డి, చంద్రశేఖర్‌, శ్రీనాథ్‌ రెడ్డి, ఖాజ తదితరులు ఉన్నారు.

మా నాన్నకు ఓటేయండి: రంజిత్‌రెడ్డి తనయుడు

రాజేంద్రనగర్‌: కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కుమారుడు ఆర్యన్‌రెడ్డి రాజేంద్రనగర్‌లోని పలు బస్తీలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఇందులో బాల్‌రాజ్‌, ఇంద్రపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, దనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల: రంజిత్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి, తితిదే పాలకమండలి సభ్యురాలు సీత ఆలూరు గ్రామంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్వీ ఇన్‌ఛార్జ్‌ శ్రవణ్‌కుమార్‌:  భారాస విద్యార్థి విభాగం రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ జి.శ్రవణ్‌కుమార్‌ మంగళవారం ఎంపీ రంజిత్‌రెడ్డి, కస్తూరి నరేందర్‌ల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చేసి కాంగ్రెస్‌లో చేరడానికి ఇతర పార్టీల నాయకులు ఆసక్తి చూపుతున్నారన్నారు. శ్రవణ్‌కుమార్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని భరోసానిచ్చారు.

చేవెళ్లలో కాసాని గెలుపు తథ్యం: భారాస

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని భారాస రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి అనంతరెడ్డి విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్‌, భాజపాలను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం మొయినాబాద్‌లోని పలు గ్రామాల్లో చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాంబాబు, శ్రీకాంత్‌, నరసింహగౌడ్‌, జయావంత్‌, రాజు, ఆంజనేయులుగౌడ్‌, ప్రవీణ్‌ రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

‘తెలంగాణ వాణి వినిపించాలంటే కారు గెలవాలి’

కొందుర్గు, న్యూస్‌టుడే: దిల్లీలో తెలంగాణ వాని వినిపించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం మండలంలోని లక్ష్మిదేవుపల్లి, వెంకిర్యాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు చెప్పే హామీలకు ఓటర్లు మరోసారి మోసపోకుండా కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో నాయకులు రామకృష్ణ, నర్సింహులు, రామకృష్ణ, నర్సింహులు, గోవింద్‌, లింగంగౌడ్‌,సురేందర్‌, వెంకటేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని