logo

పెరిగిన ఉపాధి కూలీ

ఉపాధి హామీ పథకం పనులకు దినసరి కూలీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా కూలీలకు ప్రయోజనం చేకూరనుంది.

Updated : 28 Mar 2023 06:35 IST

ఏప్రిల్‌ 1 నుంచి అమలు
ఉమ్మడి జిల్లాలో 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
న్యూస్‌టుడే, సారంగాపూర్‌, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

పాధి హామీ పథకం పనులకు దినసరి కూలీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు కూలీలకు రూ.257 చెల్లిస్తుండగా, ఏప్రిల్‌ 1 నుంచి రూ.272 అందించనున్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని 5,01,534 కుటుంబాలు ఉండగా 9,37,073 కూలీలు ఉన్నారు. ఇందులో 3,44,344 యాక్టీవ్‌ జాబ్‌కార్డులు ఉండగా, 5,24,372 మంది కూలీలు ఉన్నారు. ఆయా కూలీల ఒక ఒక్కొక్కరికి రూ.15 చొప్పున అదనంగా రానున్నాయి. ఏటా మార్చి నుంచి జూన్‌ వరకు వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న దినసరి కూలీతో ఎంతగా ఆర్థికంగా లాభం చేకూరనుంది.

మారిన విధానంతో తగ్గిన కూలీలు  

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎంఎంఎస్‌) విధానంతో ఇబ్బందిగా మారి కూలీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో మార్చి 31 వరకు 27,635 కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసుకుంటే ప్రస్తుతం కేవలం 3,565(ఈనెల 25 వరకు) మాత్రమే పూర్తి చేయగలిగారు. జగిత్యాల జిల్లాలో గతేడాది 7,567 కుటుంబాలు వంద రోజులు పూరి చేసుకోగా ప్రస్తుతం 604, కరీంనగర్‌లో 7వేలు కాగా, 1,483, పెద్దపల్లి జిల్లాలో 5,475కి ప్రస్తుతం 606, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,593 పూర్తి చేసుకుంటే ఈ ఏడాది కేవలం 872 కుటుంబాలు పూర్తి చేసుకున్నాయి. గతంలో కూలీలు పనిచేసిన తర్వాత పనుల కొలతలను వారం రోజుల తరువాత ఫొటోలు తీసుకునే వారు. ప్రస్తుత విధానం అలా కాకుండా ప్రతి రోజు రెండు సార్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం వేసవి కావడంతో ఉదయం వచ్చిన కూలీలు వారి కొలతల ప్రకారం పనులు చేసుకుని వెళుతున్నారు. దీనివల్ల ఉదయం తీసుకున్నప్పటికీ మధ్యాహ్నం సమయం మళ్లీ కూలీలు పనుల వద్దకు వెళ్లి వారి తీసుకోవడం కష్టంగా మారింది. ఒక్క పనిని రెండేసి మార్లు తీయడం ఇబ్బందిగా మారిందని ఉపాధి సిబ్బంది పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని