logo

ఠాణాలో నారసింహుడికి పూజలు

నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో సాధారణంగా ఉండే పోలీసుస్టేషన్‌లో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరివార సమేతంగా వెళ్లి పూజలందుకున్నారు.

Published : 27 Mar 2024 03:21 IST

 పూజలో పాల్గొన్న పోలీసు కుటుంబ సభ్యులు
ధర్మపురి, న్యూస్‌టుడే : నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో సాధారణంగా ఉండే పోలీసుస్టేషన్‌లో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరివార సమేతంగా వెళ్లి పూజలందుకున్నారు. ఈ తంతు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో ఏటా జరుగుతుంది. ఈ ఉత్సవానికి సంబంధించి దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసుస్టేషన్‌కు స్వామివారిని తీసుకెళ్లి మంగళవారం రాత్రి పూజలు చేశారు. వేలాది మంది భక్తులు వెంటరాగా, సాంస్కృతిక కళాప్రదర్శనలతో, డప్పు వాయిద్యాలతో పురవీధుల నుంచి శోభాయాత్ర నిర్వహించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌, సీఐ రాంనర్సింహారెడ్డి, పలువురు ఎస్సైలు పోలీసు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవను తమ భుజాలపై పెట్టుకుని సాదరంగా ఆహ్వానించి ఠాణాలో స్వామి వారికి పూజలు చేశారు.

రాజన్న హుండీ ఆదాయం రూ.2.21 కోట్లు

 వేములవాడ, న్యూస్‌టుడే: వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి 21 రోజుల హుండీలను మంగళవారం ఆలయ అధికారులు లెక్కించారు. రూ.2,21,29,350ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. బంగారం 463 గ్రాములు, వెండి 19.8 కిలోలను భక్తులు సమర్పించినట్లు తెలిపారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు