logo

ఒక నియోజకవర్గం.. ఇద్దరు ప్రజాప్రతినిధులు

1952, 1957 ఎన్నికల సమయంలో కరీంనగర్‌ లోక్‌సభా స్థానం ‘ద్వి’ నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడి ఓటర్లు ఇద్దరు సభ్యులకు ఎన్నుకునేవారు.

Published : 17 Apr 2024 05:29 IST

1952, 1957 ఎన్నికల సమయంలో కరీంనగర్‌ లోక్‌సభా స్థానం ‘ద్వి’ నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడి ఓటర్లు ఇద్దరు సభ్యులకు ఎన్నుకునేవారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒకే నియోజకవర్గం ఉండటంతో ఈ విధానాన్ని అనుసరించారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ నుంచి బద్దం ఎల్లారెడ్డి, ఎన్‌.సి.ఎఫ్‌. నుంచి ఎం.ఆర్‌.కృష్ణ ఎన్నికయ్యారు. 1957లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎం.శ్రీరంగారావు, ఎం.ఆర్‌.కృష్ణ ఎన్నికయ్యారు. 1962లో కరీంనగర్‌ నియోజకవర్గం రెండుగా విడిపోయింది. దీంతో పెద్దపల్లి, కరీంనగర్‌ ఎంపీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగాయి. ద్వి నియోజకవర్గంగా ఉన్నపుడు ఒకరు జనరల్‌, మరొకరు రిజర్వుడ్‌ కేటగిరీ సభ్యులుండేవారు.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని