logo

పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన

ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు.

Updated : 23 Apr 2024 15:45 IST

జమ్మికుంట: ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు రైతులకు డబ్బులను ఇచ్చేందుకు బ్యాంకు నుంచి రూ.15 లక్షలు తీసుకువెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఎన్నికల కోడ్‌తో తమను ఇబ్బందులకు గురిచేస్తుంటే వ్యాపారాలు ఎలా చేయాలంటూ వారు ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తాము వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని