logo

పాలేరులో మేమే కీలకం: కూనంనేని

పాలేరు నియోజకవర్గంలో తామే కీలకమని, తాము సూచించిన అభ్యర్థే ఎమ్మెల్యేగా గెలుస్తారని అవసరమైతే పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Published : 02 Dec 2022 02:55 IST

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వేదికపై బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌

ఖమ్మం గ్రామీణం: పాలేరు నియోజకవర్గంలో తామే కీలకమని, తాము సూచించిన అభ్యర్థే ఎమ్మెల్యేగా గెలుస్తారని అవసరమైతే పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ పాలేరు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం ఖమ్మం గ్రామీణ మండలం నాయుడుపేటలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే అతను పార్టీ మారి సీపీఐ నాయకులు, కార్యకర్తలపైనే కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పోటీచేసేది తామేనంటూ కొంత మంది గంగిరెద్దుల మాదిరిగా గ్రామాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చనిపోయిన వారికి డబ్బులు ఇస్తామంటూ ఓట్ల కోసమే డబ్బు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారందరూ పార్టీలు మారుతుంటే ఆపలేకపోయారు, అటువంటి పార్టీకి ఎలా మద్దతు ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో వైరాలో తమ అభ్యర్థిని కాంగ్రెస్‌ వారు గెలిపించలేదని గుర్తు చేశారు.  25 మందితో పాలేరు నియోజకవర్గ ఎన్నికల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ నాయకుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, మౌలానా, దండి సురేశ్‌, పుచ్చకాయల కమలాకర్‌, రామ్మూర్తినాయక్‌, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్‌, రామ్‌కోటి, రంగారావు, భాస్కర్‌రావు, శంకరయ్య, సీతయ్య, బాలరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని