logo

వయస్సు 11... పరుగులో నంబర్‌ 1

పదకొండేళ్ల వ్యూహిత రాష్ట్రస్థాయిలో జరిగిన వెయ్యి మీటర్ల స్కేటింగ్‌ రేస్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకొంది. నగరంలోని సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈమె నాలుగేళ్లుగా సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని స్కేటింగ్‌ శిబిరంలో శిక్షణలో ఉంది.

Published : 27 Mar 2023 04:02 IST

వ్యూహిత

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే: పదకొండేళ్ల వ్యూహిత రాష్ట్రస్థాయిలో జరిగిన వెయ్యి మీటర్ల స్కేటింగ్‌ రేస్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకొంది. నగరంలోని సెయింట్‌ జోసఫ్‌ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈమె నాలుగేళ్లుగా సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని స్కేటింగ్‌ శిబిరంలో శిక్షణలో ఉంది. క్రమం తప్పకుండా సాధన చేస్తున్న ఈ చిన్నారి ఇప్పటికే మూడు రాష్ట్రస్థాయి పతకాలు, ఓ జాతీయ పతకాన్ని సొంతం చేసుకొంది.

ఆదివారం హైదరాబాదులో రాష్ట్రస్థాయి ఇంటర్‌ స్కూల్స్‌ రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో వ్యూహిత స్వర్ణం గెల్చుకొంది. మూడేళ్లుగా వెయ్యి మీటర్ల రేస్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. మూడుసార్లు జాతీయ పోటీలకు అర్హత సాధించింది. గత ఏడాది ఫిబ్రవరి రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో రజత పతకం గెల్చుకొంది. పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి పతకాలు చేతికి అందుతుండటంతో బాలికలో పట్టుదల పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఈ ఏడాది జరుగనున్న జాతీయ పోటీల్లో విజయమే లక్ష్యంగా వ్యూహిత సాధన చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని