logo

ఎస్పీతో నేటి నుంచి ‘ప్రత్యక్ష స్పందన’

జిల్లా ఎస్సీ సిద్ధార్థ కౌశల్‌ ఆరంభించిన స్పందన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి విస్తరించారు. ఇప్పటి వరకు బాధితులు మచిలీపట్నం, విజయవాడ వెళ్లి ఆయన్ను కలిసి సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఇకపై బాధితులకు ఆ శ్రమ లేకుండా తమ గ్రామం నుంచే

Published : 21 Jan 2022 03:11 IST

ఎస్సీ సిద్ధార్థ కౌశల్‌

గంపలగూడెం, న్యూస్‌టుడే: జిల్లా ఎస్సీ సిద్ధార్థ కౌశల్‌ ఆరంభించిన స్పందన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి విస్తరించారు. ఇప్పటి వరకు బాధితులు మచిలీపట్నం, విజయవాడ వెళ్లి ఆయన్ను కలిసి సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఇకపై బాధితులకు ఆ శ్రమ లేకుండా తమ గ్రామం నుంచే ఆయనతో నేరుగా మాట్లాడి సమస్యను తెలిపే అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యక్ష స్పందన పేరుతో శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నారు. బాధితులు తమ గ్రామంలోని మహిళా సంక్షరణ కార్యదర్శికి సమస్యను వివరిస్తే వారే స్లాట్‌ బుక్‌ చేసి ఆరోజు ఏ సమయంలో ఎస్పీ మాట్లాడతారో చెబుతారు. ఆ సమయానికి గ్రామ సచివాలయంలో ఉంటే, వారితో ఎస్పీ మాట్లాడి సమస్యను తెలుసుకుంటారు. ప్రత్యక్ష స్పందన కోసం జీఎంఎస్‌కేలకు అవసరమైన సామగ్రిని అందించి శిక్షణ ఇచ్చారు. సమస్య తీవ్రతను బట్టి సత్వర చర్యలకు దిగువస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేస్తారు. ఆ సమయంలో డీఎస్పీ, సీఐ, ఎస్సైలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి సంబంధిత పత్రాలను బాధితులకు అందజేస్తారు. ఇకపై జిల్లా ఎస్పీతో తమ సమస్యలను చెప్పుకునేందుకు గ్రామ సచివాలయం నుంచే ప్రత్యక్ష స్పందన కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవచ్ఛు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని