logo

అక్రమ కేసులు పెట్టించడాన్ని శాంతి రాజకీయాలంటారా?

బేతంచెర్లలో అక్కడి మైనింగ్‌ వ్యాపారులు, పరిశ్రమల నిర్వాహకులు, తెదేపా నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిని ఇబ్బందులకు గురిచేయడమేనా శాంతి రాజకీయాలంటే అని తెదేపా నియోజకవర్గ బాధ్యులు ధర్మవరం సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Published : 17 Aug 2022 02:51 IST

మాట్లాడుతున్న తెదేపా నియోజకవర్గ బాధ్యుడు సుబ్బారెడ్డి

డోన్‌, న్యూస్‌టుడే: బేతంచెర్లలో అక్కడి మైనింగ్‌ వ్యాపారులు, పరిశ్రమల నిర్వాహకులు, తెదేపా నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిని ఇబ్బందులకు గురిచేయడమేనా శాంతి రాజకీయాలంటే అని తెదేపా నియోజకవర్గ బాధ్యులు ధర్మవరం సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం డోన్‌ పట్టణంలోని 22వ వార్డులో పట్టణ అధ్యక్షులు సీఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి మంత్రి అనుచరులు చేస్తున్న దందాలు, ప్రభుత్వం ధరలు పెంచటంతో పడుతున్న ఇబ్బందులు వివరించారు. డోన్‌లో వైకాపా నాయకులు అభివృద్ధి మాటున అక్రమాలు చేస్తుంటే వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వైకాపా నాయకులు భూఅక్రమాలకు పాల్పడుతూ ఎక్కడా ఫిర్యాదులు రాలేదు కదా అని ప్రశ్నిస్తున్నారని, వారు ఎక్కడ దాడులకు దిగుతారో అనే భయపడి బాధితులు ముందుకు రావటం లేదన్నారు. నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాలు ఎంతో అభివృద్ధి చేశాయని, వాటి గురించి మాట్లాడకుండా ఏదో తామే అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, శ్రీనివాసులు యాదవ్‌, ప్రజావైద్యశాల మల్లికార్జున, బాష్యం రమణగౌడ్‌, శ్రీనివాసులు, గోవిందు, మద్దయ్య, గోవిందు, గుల్షన్‌, కిరణ్‌, ధను, రామాంజనేయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని