logo

బెలూం గుహల్లో నిర్లక్ష్యపు చీకటి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో దేశంలో ప్రసిద్ధి చెందిన బెలూం గుహలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గుహలు.

Published : 26 Jan 2023 01:49 IST

బెలూం గుహలో ఊడలమర్రి ప్రాంతంలో ఊడిపడిన బ్లోయర్‌

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో దేశంలో ప్రసిద్ధి చెందిన బెలూం గుహలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గుహలు. సుమారు మూడు కిలోమీటర్ల మేర విస్తరించాయి. పర్యాటక ప్రదేశంగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న గుహల నిర్వహణ సరిగా లేక పర్యాటకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.50 లక్షలపైగా ఆదాయం రాగా, గతేడాది కేవలం రూ.10 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. వసతుల లేమి ఇందుకు ప్రధాన కారణం. గుహ లోపల చాలా ప్రాంతాల్లో లైటింగ్‌ వ్యవస్థ సరిగా లేదు. బ్లోయర్‌(గాలి వీచే యంత్రాలు) పనిచేయక పక్కన పడేశారు. లోపలికి వెళ్లిన పర్యాటకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లోపల ఊడలమర్రి మండపం ప్రాంతంలో చీకటిగా ఉండి బ్లోయర్లు పనిచేయడం లేదు. గతంలో పర్యాటక మంత్రిగా పనిచేసిన మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో స్థానికంగా అభివృద్ధి పనులు జరగగా, ప్రస్తుత ప్రభుత్వం నిధుల కేటాయింపును పూర్తిగా విస్మరించడం గమనార్హం.

నడిచే  దారిలో  ఉన్ పెద్దపెద్ద బండరాళ్లు

ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని