logo

ముఖ్యమంత్రికి ఓటమి భయం: మాజీ ఎమ్మెల్యే బీసీ

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకొందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

Published : 05 Feb 2023 02:24 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ

బనగానపల్లి, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకొందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఎనిమిదో రోజు పాదయాత్ర బంగారు పాళ్యం చేరుకోగానే విద్యుత్‌ నిలిపి వేసి అనుమతులు లేవని వాహనాలు సీజ్‌ చేయడం అమానుషమన్నారు. పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. 100 కి.మీ. పాదయాత్రలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. పోలీసులే కార్యకర్తలపై దాడి చేసి తిరిగి లోకేశ్‌, అమర్నాథ్‌రెడ్డిపై కేసులు పెట్టడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదోననే అనుమానం కలుగుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ పాదయాత్రకు అప్పటి తెదేపా ప్రభుత్వం సహకరించలేదా అని ప్రశ్నించారు. దేశంలో ఎంతో మంది నాయకులు పాదయాత్ర చేశారని ఎక్కడా ఇలా అడ్డంకులు సృష్టించలేదని తెలిపారు.  ఆదివారం ఉదయం 9 గంటలకు బనగానపల్లిలోని జీఎంఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఆర్టీఎస్‌ (రియల్‌ టైం స్ట్రాటజీ) సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తెదేపా మండల నాయకులు, బూత్‌, క్లస్టర్‌, సెక్షన్‌ ఇన్‌ఛార్జిలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంసీటీసీ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని