logo

మొండిగోడలపై.. పేదల గోడు

జగనన్న కాలనీల పేరుతో గ్రామాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. ఐదేళ్లు పూర్తయ్యాయి. ఒక్క ఇల్లు పూర్తికాలేదు.. పేదోడి కల నెరవేరలేదు. గ్రామాలకు దూరంగా కాలనీల స్థలాలు ఎంపిక చేశారు.

Published : 17 Apr 2024 03:29 IST

ఈనాడు, కర్నూలు: జగనన్న కాలనీల పేరుతో గ్రామాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. ఐదేళ్లు పూర్తయ్యాయి. ఒక్క ఇల్లు పూర్తికాలేదు.. పేదోడి కల నెరవేరలేదు. గ్రామాలకు దూరంగా కాలనీల స్థలాలు ఎంపిక చేశారు. వెళ్లేందుకు దారి లేదు.. నిర్మాణాలకు నీరు రాదు.. యంత్రాలు పనిచేయాలంటే కరెంటూ లేదు. ఎలాగోలా అష్టకష్టాలు పడుతూ.. పునాదులు వేశారు. ఖర్చు పెరిగిపోయి.. పునాదుల్లోనే ఆగిపోయాయి. నాసిరకం నిర్మాణ సామగ్రి వినియోగించడంతో గోడలు నెర్రలిచ్చాయి. పునాదులపై ముళ్లకంపలు మొలిచాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో.. రైతులు పంటలు సాగు చేస్తున్నారు. పేదోడి గూడు గోడు వినిపించుకునేదెవరని ఎదురుచూస్తున్నారు.

గుట్టపై ఇంటి గుట్టు: డోన్‌ దొరపల్లె గుట్టపై నెమ్మదిగా సాగుతున్న జగనన్న ఇంటి నిర్మాణాలు  


ఇది పొదలిళ్లు: కర్నూలు మండలంలోని రుద్రవరం జగనన్న కాలనీలో ఇలా ముళ్లపొదలు పెరిగాయి. కొందరు రైతులు పంటలు సైతం సాగు చేస్తున్నారు  


ఇళ్ల స్థలం.. పంట పొలం: నంద్యాలలోని జగనన్న కాలనీలో ఇంతరవకు ఒక్క ఇటుక పేర్చలేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన చోట.. సాగు చేపట్టారు.


నిర్మాణం.. అసంపూర్ణం: పత్తికొండ ప్రాంతంలో నిర్మాణాలు పునాదుల్లోనే నిలిచాయి. సమీపంలో డంపింగ్‌ యార్డు ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడంలేదు.


పునాదిరాళ్లపై ముళ్లపొదలు: ఆదోనిలో జగనన్న కాలనీ దుస్థితి


ఇటుకలు ముక్కలు: ఎమ్మిగనూరులోని జగనన్న   కాలనీలో తయారు చేస్తున్న   ఇటుకలు విరిగిపోతున్నాయి. అయినా వాటినే ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు.


లోన లొటారం: ఆత్మకూరులో పునాది దశలో ఆగిన నిర్మాణాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని