logo

అభ్యర్థులు.. ఆస్తులు

ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను  అఫిడవిట్‌లో వెల్లడించారు.

Updated : 23 Apr 2024 03:11 IST

సాయన్నకు వాహనం లేదట

ఆదోని గ్రామీణం, నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను  అఫిడవిట్‌లో వెల్లడించారు. ఎన్నికల సభలో  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను పరిచయం చేసే సందర్భంలో సాయిప్రసాద్‌రెడ్డి ‘ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే’ అని చెప్పారు. కానీ  అఫిడవిట్‌లో మాత్రం రూ.13కోట్లపైనే ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.కోట్లలో సంపాదనలు ఉన్నా.. అఫిడవిట్‌లో మాత్రం తక్కువగా చూపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


అఫిడవిట్‌ను సరిచేయండి: జేసీ

ఈనాడు, కర్నూలు: పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోమవారం అభిమానులతో వచ్చి కర్నూలు సంయుక్త కలెక్టరు నారపురెడ్డి మౌర్యకు నామపత్రం సమర్పించారు. ఆయన సమర్పించిన అఫిడవిట్లో అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. దీంతో వాటిని సరిచేసుకుని రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అంతర్జాల చిరునామాలో ఆయన అఫిడవిట్‌ కానరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని