logo

అందరికీ రాజ్యాంగ ఫలాలు

సామాజిక న్యాయం, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సమానత్వం భారత రాజ్యాంగం అందిôచిన ఫలాలని అందరూ కట్టుబడి ఉండాలని కొల్లాపూర్‌ సివిల్‌ కోర్టు జడ్జి వెంకటరమణ సుహాస్‌ అన్నారు

Published : 27 Nov 2022 04:26 IST

మాట్లాడుతున్న న్యాయమూర్తి వెంకట రమణ సుహాస్‌

కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే : సామాజిక న్యాయం, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సమానత్వం భారత రాజ్యాంగం అందిôచిన ఫలాలని అందరూ కట్టుబడి ఉండాలని కొల్లాపూర్‌ సివిల్‌ కోర్టు జడ్జి వెంకటరమణ సుహాస్‌ అన్నారు. శనివారం భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన రాజ్యాంగం అనేక దేశాలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తోందని మహిళలు చట్టాలను వినియోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జోత్స్య, మిథున్‌తేజ, కళాశాల ప్రధానాచార్యులు మల్లేశం, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉపేందర్‌, న్యాయవాదులు వసంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కురుమూర్తి, నిరంజన్‌, మోహన్‌లాల్‌, కురుమయ్య, రామలక్ష్మమ్మ, నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని