logo

దేశంలో రామరాజ్యానికి అడుగులు : డీకే అరుణ

అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Published : 18 Apr 2024 03:56 IST

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ, విఘ్నేశ్వరకాలనీ, పద్మావతికాలనీ, టీచర్స్‌కాలనీ, మహబూబ్‌నగర్‌ మండలం గాజులపేటలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో డీకే అరుణ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల పాలక మండలి సభ్యులు, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు డీకే అరుణను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహిస్తున్న శ్రీరామ నవమికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఇన్నేళ్లు రాములోరికి అయోధ్య జన్మస్థలమని చెప్పటమే తప్పా ఆయనకంటూ ఇల్లు ఉండేది కాదన్నారు. ఇప్పుడు రాముడి జన్మభూమి అయోధ్యలో భవ్యమైన ఆలయం నిర్మాణమైందని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సంపూర్ణ మెజార్టీ సాధించి మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, రామరాజ్య స్థాపనకు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఆమె వెంట భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ నేతలు పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, పోతుల రాజేందర్‌రెడ్డి, రాజుగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని