logo

ఐటీ కారిడార్‌ ఏర్పాటు.. ఉపాధి కల్పనకు కృషి

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో ఐటీ కారిడార్‌, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్‌యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.

Published : 18 Apr 2024 04:08 IST

నాగర్‌కర్నూల్‌ ఎంపీ  భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌

నాగర్‌కర్నూల్‌ : సమావేశంలో మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో ఐటీ కారిడార్‌, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్‌యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. భాజపా గెలిస్తే దేశ భద్రతకు మరిన్ని చట్టాల చేయవచ్చన్నారు. గడిచిన పదేళ్లలో యువకులకు ఉపాధిని విస్మరించినందుకే భారాసను ఇంటికి పంపించారన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి జరగాలంటే భాజపాను గెలిపించాలని కోరారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు రైల్వేలైను, పరిశ్రమలు, రహదారులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో వనపర్తి జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, నాయకులు రఘునందన్‌రెడ్డి, రాజవర్థన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని