logo

ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు

ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

Published : 19 Apr 2024 05:40 IST

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌కుమార్‌ తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులుగా సౌరభ్‌ గురువారం నాగర్‌కర్నూల్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల వారు వ్యయ పరిశీలకులకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. సోమశిల టూరిజం అతిథి గృహంలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు కలిసి ఫిర్యాదులు ఇవ్వవచ్చని చెప్పారు. చరవాణి నంబరు 80198 32010కు చేయవచ్చని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలిస్తారన్నారు. రాజకీయ ప్రకటనలను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1950, సీ విజల్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న అంశాలను ఎన్నికల వ్యయ పరిశీలకుడికి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని