logo

యువత చేతుల్లోనే దేశ భవిత

దేశ భవి ష్యత్తు నేటి యువత చేతుల్లోనే ఉంటుందని జాతీయ భావంతో ముందడుగేస్తే ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబడుతుందని లెఫ్టినెంట్‌ కల్నల్‌ పి.ఎస్‌.నందా అన్నారు. గజ్వేల్‌లోని బాలుర విద్యాహబ్‌ వేదికగా నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు ఇక్కడ వారం రోజుల పాటు నిర్వహించిన ఎన్‌సీసీ శిక్షణా శిబిరాలు సోమవారం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 04 Oct 2022 02:56 IST

లెఫ్టినెంట్‌ కల్నల్‌ పి.ఎస్‌.నందా

ప్రసంగిస్తున్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ నందా

గజ్వేల్‌, న్యూస్‌టుడే: దేశ భవి ష్యత్తు నేటి యువత చేతుల్లోనే ఉంటుందని జాతీయ భావంతో ముందడుగేస్తే ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబడుతుందని లెఫ్టినెంట్‌ కల్నల్‌ పి.ఎస్‌.నందా అన్నారు. గజ్వేల్‌లోని బాలుర విద్యాహబ్‌ వేదికగా నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు ఇక్కడ వారం రోజుల పాటు నిర్వహించిన ఎన్‌సీసీ శిక్షణా శిబిరాలు సోమవారం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు గజ్వేల్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌- డిగ్రీ కళాశాల వరకు 10 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్‌ ఏసీపీ రమేశ్‌ ర్యాలీకి హాజరయ్యారు. అనంతరం బాలుర హబ్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీ శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలన్నారు. అప్పుడే జీవితంలో నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. ఫైరింగ్‌, కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జీవితంలో ఉపయోగడతాయన్నారు. క్యాడెట్ల శిక్షణ, వసతికి విశాలమైన గదులు సమకూర్చినందుకు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సంక్షేమ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు మనోజ్‌కుమార్‌, కృష్ణ, ప్రియ, భవాని, విజయభాస్కర్‌, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, మహేశ్‌, మక్కర్‌సింగ్‌, అచ్చార్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ ప్రధాన రహదారిపై ఎన్‌సీసీ విద్యార్థుల ర్యాలీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు