logo

ఎన్నికల నిబంధనలు అమలు చేయాలి: కలెక్టర్‌

ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు.

Updated : 16 Apr 2024 17:13 IST

భువనగిరి: ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం సెక్టోరియల్ అధికారుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలను తీసుకోవాలన్నారు. సెక్టోరియల్ అధికారులు తమ విధి విధానాల హ్యాండ్ బుక్స్ లోని నియమాలను, మార్గదర్శకాలను క్షుణంగా చదివి అవగాహన కలిగి వుండాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వంద శాతం ఎన్నికల కమీషన్ నిబంధనలను పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి సెక్టార్ ఆఫీసర్లకు రెండవ విడత శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని