logo

భాజపాతో కాంగ్రెస్‌ లోపాయికారి ఒప్పందం: జగదీశ్‌రెడ్డి

భాజపాతో కాంగ్రెస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని, లేకుంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 01 May 2024 06:01 IST

సోలిపేటలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: భాజపాతో కాంగ్రెస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని, లేకుంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసం చేసేందుకే రేవంత్‌రెడ్డికి నోటీసుల డ్రామాకు భాజపా తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌, భాజపా చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలకు అర్థమవుతోందన్నారు. సూర్యాపేటతోపాటు మండలంలోని సోలిపేట గ్రామంలో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్గొండ భారాస లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారాస అధినేత కేసీఆర్‌ ఆరు రోజుల పర్యటనతో రాష్ట్రంలో ప్రజలంతా ఆయన వైపు ఉన్నట్లు స్పష్టమైందన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్‌ హవా మొదలైందని, ఆయన రోడ్డుషోలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు.  మారిన పరిస్థితుల్లో  నల్గొండ, భువనగిరి స్థానాలను భారాస కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని