logo

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

సౌదీలో భర్త ఉద్యోగంలో చేరికతో ఆనందం.. కళ్ల ముందు కన్నబిడ్డ మృత్యువాతతో విషాదం.. విభిన్న పరిస్థితి ఓ మహిళకు ఎదురైంది. విషాదకర సంఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లెలో సోమవారం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలిలా

Published : 25 Jan 2022 02:13 IST

సౌదీలో తండ్రి ఉద్యోగంలో చేరిన రోజే దుర్ఘటన

స్వగ్రామంలో విషాదం


అజీమ్‌ (పాతచిత్రం)

తిమ్మారెడ్డిపల్లె(వరికుంటపాడు), న్యూస్‌టుడే: సౌదీలో భర్త ఉద్యోగంలో చేరికతో ఆనందం.. కళ్ల ముందు కన్నబిడ్డ మృత్యువాతతో విషాదం.. విభిన్న పరిస్థితి ఓ మహిళకు ఎదురైంది. విషాదకర సంఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లెలో సోమవారం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్‌ అబ్ధుల్‌బాషా, షబిహ దంపతులకు 5, 3ఏళ్ల చిన్నారులు ఇద్దరున్నారు. నాలుగు రోజుల క్రితం షేక్‌ అబ్ధుల్‌బాషా జీవనోపాధి నిమిత్తం సౌదీ వెళ్లారు. సోమవారం ఉదయం ఉద్యోగంలో చేరినట్లు భార్య షబిహాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ ఆనందం కొద్దినిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఈమె ఇంట్లో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. పెద్ద కుమారుడు అజీమ్‌(5) ఆడుకుంటూ తాగునీటి మోటారుకు ఉన్న వైరును పట్టుకున్నాడు. ఆ తీగకు విద్యుత్తు సరఫరా అయి అజీమ్‌ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన ఆమె వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేసి అజీమ్‌ను హుటాహుటీనా చికిత్స నిమిత్తం పామూరుకు తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. బిడ్డ మృత్యువాతతో తల్లి తల్లడిల్లిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కనీసం బిడ్డ కడచూపునకు కూడా నోచుకోలేని తండ్రి సౌదీలో అల్లాడిపోతున్నాడు. ఇక్కడ షబిహ శోకసంద్రంలో మునిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని