logo

టిడ్కో ఇళ్లలబ్ధిదారులకు రుణాలు

నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. గురువారం ఆయన

Published : 28 Jan 2022 01:17 IST

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్‌ కార్యాలయంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రుణాల మంజూరుపై అధికారులతో సమీక్ష జరిపారు. సంబంధిత డాక్యుమెంటేషన్‌ పూర్తి చేసి.. లబ్ధిదారులకు త్వరగా అందించాలని సూచించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, గూడూరు మున్సిపాలిటీల్లో రుణాల మంజూరుపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారంలోగా రుణాల మంజూరులో పురోగతి కనిపించాలన్నారు. ముద్ర రుణాలను విరివిగా అందించాలని, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మెప్మా పీడీ రవీంద్ర, లీడ్‌ బ్యాంకు మేనేజరు వైవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్‌ ఓబులేసు నందన్‌, టిడ్కో ఈఈ ఉమాశంకర్‌శాస్త్రి, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మున్సిపల్‌ కమిషనర్లు రమేష్‌, శివారెడ్డి, నరేంద్ర, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌, వివిధ బ్యాంకుల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు