logo

ఎస్డీఎస్టీపీఎస్‌లో కూలిన బూడిద తొట్టెలు

తాప విద్యుత్తు కేంద్రంలోని బూడిద తొట్టెలు కూలిపోయి సరఫరా పూర్తిగా నిలిచిపోయిన సంఘటన శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ స్టేషను (ఎస్డీఎస్టీపీఎస్‌)లో శనివారం చోటుచేసుకుంది. ప్లాంటులోని తొలి యూనిట్‌ను సాంకేతిక లోపంతో ఇంజినీర్లు నిలిపివేయగా

Published : 29 May 2022 01:39 IST

కమ్మేసిన బూడిద

ముత్తుకూరు, న్యూస్‌టుడే: తాప విద్యుత్తు కేంద్రంలోని బూడిద తొట్టెలు కూలిపోయి సరఫరా పూర్తిగా నిలిచిపోయిన సంఘటన శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ స్టేషను (ఎస్డీఎస్టీపీఎస్‌)లో శనివారం చోటుచేసుకుంది. ప్లాంటులోని తొలి యూనిట్‌ను సాంకేతిక లోపంతో ఇంజినీర్లు నిలిపివేయగా రెండో యూనిట్‌కు సంబంధించి ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌లోని మూడు తొట్టెలు అధికలోడు కారణంగా కిందికి జారిపోయాయి. దాంతో వాక్యూమ్‌ పంప్‌హౌస్‌, పవర్‌ హౌస్‌ పరిసరాలు బూడిద పొగతో నిండిపోయాయి. పొగ గొట్టంలోకి బూడిద ఎగబాకింది. అదే సమయంలో గాలి తూర్పువైపు వీచడంతో సముద్రం మీదుగా ప్రయాణించింది. రెండు వారాల నుంచి కొందరు ఇంజినీర్లు ఈటీపీ తొట్టెలు నిండిపోవడంపై ఉన్నతాధికారులకు నివేదించినా స్పందన లేదనే వాదన ప్రాజెక్టులో వినిపిస్తోంది. రూ.కోట్లలోనే నష్టం ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఉన్నతస్థాయి కమిటీ సంఘటనను పరిశీలించి నివేదిస్తేనే కచ్చితమైన నష్టం తెలుస్తుందని స్థానిక ఇంజినీర్లు చెబుతున్నారు. రాష్ట్ర అవసరాలకు కొంతమేర విద్యుత్తును అందించే ప్లాంటులో ఒక్కసారిగా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఏపీ జెన్‌కోలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని