logo

ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన

దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం  పోలీసుస్టేషన్‌ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు.

Published : 24 Apr 2024 04:08 IST

పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న మాల మహాసభ మహిళా నాయకులు

మనుబోలు, న్యూస్‌టుడే : దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం  పోలీసుస్టేషన్‌ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం మేరకు... అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఒక మహిళకు, పక్కింటి వారికి వివాదాలున్నాయి. ఈనెల 17న వారి మధ్య మళ్లీ వివాదం జరిగింది. దీంతో ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఎస్సై అజయ్‌కుమార్‌ దుర్భాషలాడుతూ సదరు మహిళను బెల్ట్‌తో కొట్టారని, మాల మహాసభ అధికారి ప్రతినిధి నాగూరు మరియమ్మ, పల్లం శేషమ్మ అన్నారు. మేమంతా ఎస్సైతో మాట్లాడేందుకు రాగా దురుసుగా సమాధానమిచ్చారని వారు వాపోయారు. ఎస్పీకి ఫిర్యాదు చేసి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. నాయకులు సరోజినమ్మ, సుభాషిణి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. దీనిపై ఎస్సై అజయ్‌కుమార్‌ను వివరణ కోరగా స్థానిక గొడవ నేపథ్యంలో ఇరువర్గాలను మందలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని