logo

విద్యుత్తు ఉద్యోగుల నిరసన

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సమన్వయ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ పిలుపు మేరకు బుధవారం పవర్‌హౌజ్‌ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. విద్యుత్తు ఐకాస ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి

Published : 09 Dec 2021 03:15 IST

భోజన విరామ సమయంలో నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సమన్వయ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ పిలుపు మేరకు బుధవారం పవర్‌హౌజ్‌ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. విద్యుత్తు ఐకాస ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం చేపడుతున్న ప్రైవేటీకరణ కుట్రను వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో నిరసనలు కొనసాగిస్తామన్నారు. 1104 యూనియన్‌ కంపెనీ అధ్యక్షుడు రఘునందన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. డీఈలు యుక్తార్‌, వెంకటరమణ, నాయకులు శ్రీనివాస్‌, కాశీనాథ్‌, సురేష్‌, శ్యామ్‌, సుమిత, విజయలక్ష్మి, తోటరాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని