logo

కర్షకుల ఖాతాల్లో రూ.522.63 కోట్లు

యాసంగి పంట పెట్టుబడి కింద రైతుబంధు నగదు కర్షకుల ఖాతాల్లో జమైంది. ఉభయ జిల్లాల్లో 5,28,684 మందికిగాను రూ.522.63 కోట్లు మంజూరయ్యాయి. వీటిని గురువారం వారి ఖాతాల్లో

Published : 21 Jan 2022 03:35 IST

 రైతుబంధు నగదు జమ

ఈనాడు, నిజామాబాద్‌ : యాసంగి పంట పెట్టుబడి కింద రైతుబంధు నగదు కర్షకుల ఖాతాల్లో జమైంది. ఉభయ జిల్లాల్లో 5,28,684 మందికిగాను రూ.522.63 కోట్లు మంజూరయ్యాయి. వీటిని గురువారం వారి ఖాతాల్లో వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇరవై రోజుల క్రితం పంపిణీ ప్రారంభమైంది. పండగ ముందు వరకు 8 ఎకరాల లోపువారికే ఇచ్చారు. ఆ తర్వాత అంతకు మించి భూమి ఉన్న వారికి ఇస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 2,55,510 మంది అన్నదాతలకు గాను రూ.266.71 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 2,73,174 మంది రైతు ఖాతాల్లో రూ.255.92 కోట్లు జమయ్యాయి.
22న మంత్రి సమీక్ష
నిజామాబాద్‌ కలెక్టరేట్‌: కొవిడ్‌ నియంత్రణ, దళితబంధు లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై శనివారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్‌ కలెక్టరేట్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డిలో సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని