logo

యువత.. కొవిడ్‌ కలత

మూడో ముప్పు విరుచుకుపడుతోంది. అత్యధికంగా 15- 35 ఏళ్ల లోపు ఉన్నవారికి వైరస్‌ సోకుతోంది. ఆయా పనుల నిమిత్తం బయటకు తిరుగుతుండటంతో కొవిడ్‌ బారిన పడుతున్నారు. వారి ద్వారా కుటుంబీకులకూ సోకుతోంది. రెండు వారాల్లో 1120

Published : 22 Jan 2022 03:30 IST

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ
ఎక్కువగా 15- 35  ఏళ్లలోపు వారికే వైరస్‌
న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

మూడో ముప్పు విరుచుకుపడుతోంది. అత్యధికంగా 15- 35 ఏళ్ల లోపు ఉన్నవారికి వైరస్‌ సోకుతోంది. ఆయా పనుల నిమిత్తం బయటకు తిరుగుతుండటంతో కొవిడ్‌ బారిన పడుతున్నారు. వారి ద్వారా కుటుంబీకులకూ సోకుతోంది. రెండు వారాల్లో 1120 మందికి వైరస్‌ సోకగా.. అందులో 30- 35 శాతం మంది యువకులేనని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. యువత జాగ్రత్తలు పాటించాలని  సూచిస్తున్నారు.

తక్కువలోనే ఎక్కువగా..
జిల్లాలో కొవిడ్‌ మొదటి, రెండో దశ కన్నా ఇప్పుడే తక్కువ పరీక్షల్లో ఎక్కువ మందికి వైరస్‌ నిర్ధారణవుతోంది. ఈ వారంలో కేసులు నమోదైన సరళిని పరిశీలిస్తే మొత్తం పరీక్షల్లో 35- 40 శాతం పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులతో అనేక మంది బాధపడుతున్నారు. చలిగాలులు వీస్తుండటంతో సాధారణ ఫ్లూ, జలుబు వ్యాపిస్తున్నాయి. ఇవి కొవిడ్‌ లక్షణాలను పోలి ఉండటంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు.

పెరిగిన ఔషధాల వినియోగం
ప్రైవేటు ఔషధ దుకాణాల్లో కొవిడ్‌ ఐసోలేషన్‌ కిట్ల అమ్మకాలు పెరిగాయి. అజిత్రోమైసిన్‌, డోలో-650, లివోసిట్రిజిన్‌, మల్టీవిటమిన్‌, డి-3 విటమిన్‌ మాత్రలకు డిమాండు ఏర్పడింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొనుగోలు చేసి వాడుతున్నారు. ఈసారి హోం ఐసోలేషన్‌ కాల వ్యవధి 14 రోజుల నుంచి సగానికి తగ్గించారు. వైరస్‌ వేగంగా వ్యాపించినా తీవ్రత తక్కువగా ఉండటమే కారణం.

ర్యాపిడ్‌ పరీక్షల్లో..
కామారెడ్డి 4, బాన్సువాడ 38, ఎల్లారెడ్డి 16, గాంధారి 2, భిక్కనూరు 1, బీబీపేట 3, ఎర్రాపహాడ్‌ 1, రాజంపేట 1, సదాశివనగర్‌ 3, దేవునిపల్లి 15, రాజీవ్‌నగర్‌ 15, (కామారెడ్డి)లింగంపేట 5, బీర్కూర్‌ 17, హన్మాజీపేట 1, పుల్కల్‌ 1, పెద్దకొడప్‌గల్‌ 2.

50శాతానికి పైగా..
ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో 50 శాతానికి పైగా పాజిటివ్‌లు వస్తున్నాయి. అత్యధికంగా కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాకేంద్రానికి హైదరాబాద్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధికంగా రాకపోకలు సాగుతున్నాయి. అక్కడ వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని