logo

ఆదర్శ జిల్లాగా నిలుపుదాం..

ప్రభుత్వ పథకాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలుస్తోందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆయన

Published : 27 Jan 2022 05:05 IST

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

జాతీయ జెండావిష్కరణలో పాల్గొన్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు,

పక్కన ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, ఏఎస్పీ అన్యోన్య

ప్రభుత్వ పథకాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలుస్తోందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. సమన్వయంతో పని చేస్తూ ఆదర్శ జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు సేవ చేసేఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, డీఆర్డీవో వెంకటమాధవరావు, అధికారులు, సిబ్బంది, తెరాస నాయకులు పాల్గొన్నారు.

20 నిమిషాల్లోనే..

ఏటా సందడిగా సాగే గణతంత్ర వేడుకలు కరోనా కారణంగా ఈసారి సాదాసీదాగా.. 20 నిమిషాల్లోనే ముగించారు. గతంలో మాదిరిగా ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ, విద్యార్థుల ప్రదర్శనలు ఉండాలని తొలుత నిర్ణయించారు. అందుకనుగుణంగా ఏర్పాట్లూ చేపట్టారు. ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిర్దేశం మేరకు అన్నీ రద్దు చేశారు.

జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో జెండా ఎగురవేసిన డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు

భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని