logo

పరీక్ష కేంద్రాల తనిఖీ

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ కోర్సుల థియరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం బోధన్‌లోని కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ తనిఖీ చేశారు. ఉదయం జరిగిన మూడో సెమిస్టర్‌/రెగ్యులర్‌, ఏడు, తొమ్మిదో

Published : 20 May 2022 03:10 IST

బోధన్‌లోని కేంద్రంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ కోర్సుల థియరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం బోధన్‌లోని కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ తనిఖీ చేశారు. ఉదయం జరిగిన మూడో సెమిస్టర్‌/రెగ్యులర్‌, ఏడు, తొమ్మిదో సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌లో 2,199 కిగాను 2,045 మంది, మధ్యాహ్నం ఐదో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌లో ముగ్గురు హాజరైనట్లు వర్సిటీ సీవోఈ ఆచార్య అరుణ వెల్లడించారు.
80 మంది గైర్హాజరు
తెవివి క్యాంపస్‌: తెవివి పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌/బ్యాక్‌లాగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో 1,424 కిగాను 1,344 మంది హాజరైనట్లు సీవోఈ అరుణ తెలిపారు.
డిగ్రీ.. తెవివి క్యాంపస్‌: తెవివి పరిధిలో డిగ్రీ వన్‌ టైం ఛాన్స్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం రెండో ఏడాది బ్యాక్‌లాగ్‌లో 147 కిగాను 129 మంది హాజరయ్యారని సీవోఈ అరుణ పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని