logo

క్షేత్రసహాయకులకు దస్త్రాలు అప్పగించొద్దు

ఏడాది నిరీక్షణ అనంతరం విధుల్లో చేరిన ఉపాధి క్షేత్రసహాయకులకు ఉత్తర్వులు వెలువడే వరకు దస్త్రాలు అప్పగించొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల నిర్వహణకు నూతన సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేయడంతో పాటు నిబంధనలను సంపూర్ణంగా మార్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 17 Aug 2022 02:46 IST

పంచాయతీ కార్యదర్శులకు సర్కారు ఆదేశాలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఏడాది నిరీక్షణ అనంతరం విధుల్లో చేరిన ఉపాధి క్షేత్రసహాయకులకు ఉత్తర్వులు వెలువడే వరకు దస్త్రాలు అప్పగించొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల నిర్వహణకు నూతన సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేయడంతో పాటు నిబంధనలను సంపూర్ణంగా మార్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 296 మంది క్షేత్రసహాయకులు ఇటీవలే విధుల్లో చేరారు. కార్యదర్శులు ఉపాధి పనుల దస్త్రాలన్నీ వారికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఉపాధి పనుల్లో అక్రమాలు

కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల నిర్వహణపై నిఘా పెట్టిన నేపథ్యంలో అక్రమాలకు తావు లేకుండా పనులు చేపట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అక్రమాలు జరిగాయని నిధులు రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యదర్శుల ఆధ్వర్యంలోనే పనులు చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని