logo

206 మంది విద్యార్థులు.. రెండే గదులు

ముత్యంపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాల చదువుల్లో ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. మన ఊరు- మన బడి పథకంలోనూ దీనిపై దయ చూపలేదు.

Published : 08 Dec 2022 06:15 IST

మూత్రశాలకు వెళ్లేందుకు వరుసలో నిల్చున్న చిన్నారులు

ముత్యంపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాల చదువుల్లో ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. మన ఊరు- మన బడి పథకంలోనూ దీనిపై దయ చూపలేదు. 206 మంది విద్యార్థులుండగా కార్యాలయంతో కలిపి రెండే తరగతి గదులున్నాయి. చిన్నారులు చెట్ల కింద, వరండాలో చదువుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో ఆరుబయట వణుకుతూ కూర్చుంటున్నారు. ఈ పాఠశాల చదువులతోపాటు పచ్చదనం, పరిశుభ్రత విషయంలోనూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, ఒక డిప్యుటేషన్‌ ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన ఇద్దరు వాలంటీర్లు చదువులు చెబుతున్నారు. రెండే మరుగుదొడ్లు ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ఈ ఏడాది జనవరిలో గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. రెండు అదనపు గదుల నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, దోమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని