logo

తపాలా సేవలు... ప్రజలకు చేరువలో

తపాలా సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. దీనిలో భాగంగా మరో నూతన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Published : 30 Jan 2023 03:04 IST

న్యూస్‌టుడే,బాన్సువాడ పట్టణం

కరపత్రాలను విడుదల చేస్తున్న అధికారులు, సిబ్బంది

తపాలా సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. దీనిలో భాగంగా మరో నూతన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచారు. ఈ రేట్లు మార్చి 31 వరకు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

వడ్డీ రేట్లు ఇలా...

టైమ్‌ డిపాజిట్‌ పథకంలో గతంలో వడ్డీ 5.5 శాతం ఉండి. రూ. లక్షకు ఏటా రూ. 5614 చెల్లించారు. జనవరి 1 నుంచి 6.6 శాతానికి పెరిగి రూ.. 6765 అందిస్తున్నారు. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో గతంలో 6.7 శాతం వడ్డీతో రూ.లక్షకు నెలకు రూ. 558 వచ్చేది. ప్రస్తుతం 7.1శాతానికి పెరిగి రూ. 591 చెల్లిస్తున్నారు. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో ఒకరు గరిష్ఠంగా రూ. 4.5 లక్షలు, ఇద్దరు కలిపి గరిష్ఠంగా రూ. 9లక్షలు వరకు డిపాజిట్‌ చేయవచ్చు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకంలో వడ్డీ 6.8శాతం నుంచి 7శాతానికి పెరిగింది. కిసాన్‌ వికాస్‌ పత్ర్‌లో డిపాజిట్‌ సొమ్ము గతంలో 10 సంవత్సరాల నాలుగు నెలలకు రెట్టింపు అవుతుండగా ... ప్రస్తుతం పదేళ్లకే రెట్టింపు అవుతుంది. సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్ల వడ్డీ రేటు సైతం 7.6శాతం నుంచి 8శాతానికి పెరిగింది. గతంలో మూడు నెలలకు రూ.లక్షకు రూ. 1900 వడ్డీ రాగా ప్రస్తుతం రూ. 2వేలు అందిస్తున్నారు.

30వేల ఖాతాలే లక్ష్యం
వేణు,  ఇన్‌స్పెక్టర్‌, బోధన్‌ సబ్‌డివిజన్‌..

తపాలా శాఖ అందిస్తున్న పలు ప్రత్యేక కార్యక్రమాలు, వడ్డీ రేట్ల పెంపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 31వరకు అన్ని గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా కోటి ఖాతాలు లక్ష్యం కాగా.. ఉమ్మడి జిల్లాలో 30 వేల నూతన ఖాతాలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. సంస్థ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని