logo

జుక్కల్‌ తొలి ఎమ్మెల్యే కోటగిరి వాసి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 1952లో ఎనిమిది నియోజకవర్గాలు ఉండేవి.

Published : 05 Nov 2023 03:22 IST

మాధవరావు దేశ్‌పాండే

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 1952లో ఎనిమిది నియోజకవర్గాలు ఉండేవి. అప్పుడు జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌, జుక్కల్‌ ప్రాంతాల వారు మహారాష్ట్రలోని బిలోలి నియోజకవర్గంలో ఓట్లు వేసే వారు. జుక్కల్‌.. నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 1957లో మొదటి సారి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా కోటగిరికి చెందిన మాధవరావు దేశ్‌పాండే ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.ఎల్‌.శాస్త్రిపై 714 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1957 నుంచి 1962 వరకు ఆయన జుక్కల్‌ శాసనసభ్యుడిగా కొనసాగారు. 1959లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్టు దక్కలేదు. పార్టీలో పలు కీలక పదవుల్లో కొనసాగారు. 1957లో కోటగిరి, పొతంగల్‌, రుద్రూర్‌ గ్రామాలతో పాటు జుక్కల్‌, మద్నూర్‌ ప్రాంతాలు జుక్కల్‌ నియోజకవర్గంలో ఉండేవి. 1967లో జరిగిన నియోజకవర్గాల విభజనలో కోటగిరి, పొతంగల్‌, రుద్రూర్‌ గ్రామాలు జుక్కల్‌ నుంచి విడిపోయి బాన్సువాడ నియోజకవర్గంలో కలిశాయి.

న్యూస్‌టుడే,కోటగిరి


వర్ని మండలంలో సభాపతి ప్రచారం నేడు

బాన్సువాడ: బాన్సువాడ భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం వర్ని మండలంలో చేపట్టే ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 08:30కు సిద్దాపూర్‌, 10 గంటలకు శ్యాంరావుతండా, 11 గంటలకు కోకల్‌దాస్‌తండా, 12.30కు చల్కతండా, మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూర్‌క్యాంప్‌, 3 గంటలకు పైడిమల్‌, సాయంత్రం 4 గంటలకు చింతల్‌పేట్‌తండాలో ప్రచారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని