logo

జానకీనాథుడి కల్యాణం.. కమనీయం

జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు.

Published : 18 Apr 2024 05:05 IST

సుభాష్‌నగర్‌ రామాలయంలో దేవతామూర్తుల అలంకరణ

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. కానుకలు సమర్పించారు. రామనవమి పర్వదినాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జై రాం.. జైజై సీతారాం నినాదాలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. వడపప్పు, పానకం, పులిహోరా ప్రసాదంగా పెట్టారు. జిల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించారు. సుభాష్‌నగర్‌ రామాలయంలో జిల్లా జడ్జి కుంచాల సునీత పూజలు చేశారు. ఖిల్లా రఘునాథాలయం, పెద్దరాంమఠం, సుభాష్‌నగర్‌ రామాలయం, కోదండరామాలయం, సద్గురుధామం, పంచముఖి హనుమాన్‌, తేనె సాయిబాబా, మాధవనగర్‌ సాయిబాబా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌, భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి రాములోరిని దర్శించుకున్నారు.


స్వామివారిని దర్శించుకుంటున్న భాజపా, కాంగ్రెస్‌, భారాస ఎంపీ అభ్యర్థులు అర్వింద్‌, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌

ఖిల్లా రఘునాథాలయంలో భక్తుల సందడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని