logo

1950లో ఫిర్యాదుల స్వీకరణ

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు.

Updated : 18 Apr 2024 06:26 IST

ప్రలోభాల కట్టడికి ఈసీ చర్యలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. కానుకలు ఇవ్వడం, డబ్బులు, మద్యం పంపిణీ, ఇలా ఓటర్లను ప్రలోభపెట్టే వీలుంది. వీటికి చెక్‌ పెట్టేందుకు ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదైనా 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేస్తే అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు తీసుకుంటుంది.

నెల రోజుల్లో  423..

సార్వత్రిక ఎన్నికలకు మార్చి 16న కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో 423 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం ఓటరు నమోదు, జాబితాలో పేరుందా లేదా.. గుర్తింపు కార్డు ఎక్కడ ఇస్తారు, ప్రచార అనుమతులు ఎలా తీసుకోవాలని వంటివి ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు పరిష్కరించారు.

ఇలా పని చేస్తోంది..

కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూంలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. ఓటర్లు కావాల్సిన సమాచారంతో పాటు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేస్తే నిజామాబాద్‌ కంట్రోల్‌ రూంనకు సమాచారం వస్తుంది. ఇక్కడి సిబ్బంది ఏ జిల్లాకు చెందిన ఫిర్యాదు ఉంటే అక్కడి వారికి సమాచారం చేరవేస్తారు. ఒకవేళ ఫోన్‌ ఎత్తకుంటే.. ఆ కాల్‌ నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి వెళ్తుంది. అంతేకాక ఫోన్‌ చేయగానే వెంటనే కలిసేలా చర్యలు తీసుకున్నారు. ఈ టోల్‌ఫ్రీ నంబరును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని