logo

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు

తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.

Published : 18 Apr 2024 12:20 IST

నాగిరెడ్డిపేట: తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా తాండూరు కేంద్రంలోని రైతుల  కల్లాలను పరిశీలించి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఉండాలని  సొసైటీ సీఈఓ కు సూచించారు. ధాన్యం విక్రయానికి సంబంధించిన బిల్లులను తెల్ల కాగితంపై కాకుండా రసీదులు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో హమాలి ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం  రైతులకు లబ్ధి చేకూర్చే నూతన విధానాన్ని అనుసరిస్తుందన్నారు. వారి వెంట  ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ గౌడ్, రామచంద్రారెడ్డి, విట్టల్ , దివిటి కిష్టయ్య, వేముల సంగయ్య ,సంజీవులు, వాసు రెడ్డి, దేవకుమార్, మధు, హనుమంత్ రెడ్డి, హైమద్ ప్రభాకర్  రైతులు  ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని